Revanth Reddy: ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటన గురించి ప్రధానికి వివరించా 1 y ago
TG : మొత్తం ఐదు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ - 2 విస్తరణ, ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి అనుమతి కోరామన్నారు. రీజినల్ రింగ్ రైల్వే ఏర్పాటుకు సహకరించాలని, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోరామని చెప్పారు. మూసీ - గోదావరి లింక్ కోసం రెండు వేల కోట్లు కేటాయించాలన్నారు.
తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులపై ప్రధాని మోడీకి వివరించానన్నారు. ప్రాజెక్టుల సాధన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై ఉందన్నారు. పదేళ్లు ఎస్ఎల్‌బీసీని పట్టించుకోకపోవడం వలనే కూలిందన్నారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు నీరు అందించే ప్రాజెక్టు ఎస్ఎల్‌బీసీ అన్నారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులో కమీషన్లు రావనే ఉద్దేశంతోనే కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటన గురించి కూడా ప్రధానికి వివరించానని చెప్పారు.